కరపత్రం విడుదల…
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఓబీసీ సమస్యల పైన ఆగస్టు 18, 19 న జరగబోయే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భువనగిరి పట్టణ కేంద్రంలో విద్యార్థులతో కలిసి బిసి విద్యార్థి సంఘ రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ కరపత్రం ఆవిష్కరించి, మాట్లాడారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎం పి ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో బీసీ సమస్యల పరిష్కారం కోసం జాతీయ సెమినార్,జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమానికి తరలిరావాలని అన్నారు చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని దేశవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రుత్వ శాఖ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని రానున్న బడ్జెట్లో బీసీలకు రెండు లక్షల కోట్లు కేటాయించాలని కోరారు.
విద్యారంగానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని దేశంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని గవర్నమెంట్ సంస్థలో ప్రైవేటీకరణ నిషేధించాలని బీసీ క్రిమిలేయర్ ను ఎత్తివేయాలని ప్రమోషన్లలో రిజర్వేషన్లు వర్తింపజేయాలని బీసీలంట్లే కేవలం ఓట్లు వేసే యంత్రాలుగనే చూస్తున్నారు ఉద్యోగాలలో బీసీలు 7 శాతం గిట్ల లేకపోవడం సిగ్గుచేటు రాజకీయంగా 12 శాతం దాటలేదు బీసీలు రాష్ట్ర ప్రభుత్వం ఏమో బీసీలకు స్థానిక సంస్థల 42% రిజర్వేషన్ అని చెప్పి దాన్ని అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారు బీసీలకు రాను ఎన్నికల్లో 42% జీవో తీసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.
విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని సంక్షేమాష్టలకు సొంత భవనాలు నిర్మించాలని మెస్చార్జులు 3,000లకు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం ఢిల్లీలో సవతి తల్లి ప్రేమతో ధర్నా చేస్తున్ననారు బీసీ బిల్లుకు మద్దతు అని చెప్పి ఇంతవరకు దాని ఊసే లేదు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎన్నికల నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని అగ్నిగుండం చేసుకొని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంపత్, మంజుల, శిరీష గౌడ్, ఉమా రెడ్డి, స్నేహ, రమాదేవి, ఉదయ్ శ్రీ, మానస, ప్రత్యూష, విగ్నేశ్వరి లు పాల్గొన్నారు.