Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నూలి పురుగుల నియంత్ర దినోత్సవాన్ని  ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య..

నూలి పురుగుల నియంత్ర దినోత్సవాన్ని  ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
నూలి పురుగుల నియంత్రణ చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు అన్నారు. సోమవారం ఆలేరు నియోజకవర్గం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల గుండాలలో బీర్ల ఐలయ్య నూలి పురుగుల నియంత్రణ దినోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.

మాత్రలు వలన పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, శారీరక ఎదుగుదల లోపం వంటి సమస్యలను నివారించవచ్చనిర తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, రాయగిరిలో జిల్లా కలెక్టర్ శ్రీ ఎం. హనుమంతరావు  ప్రారంభిస్తూ, లక్ష్యాన్ని దాదాపు పూర్తి చేయడం గొప్ప విజయమని తెలిపారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం. మనోహర్  మాట్లాడుతూ, నులిపురుగుల నిర్మూలనలో జిల్లావ్యాప్తంగా సాధించిన 95% కవరేజ్‌ ప్రగతిని వివరించారు.

నులిపురుగులను నివారించుటలో భాగంగా 1 నుండి 19 ఏళ్ల లోపు వయసుగల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ అందించబడ్డాయన్నారు. జిల్లాలోని అన్ని మండలాలలో అంగన్వాడి సెంటర్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ఆశ్రమ పాఠశాలలు, మదర్సాలలో చదువుతున్న ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ ఈ మాత్రలు అందించబడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్  భాస్కరరావు , డాక్టర్ రామకృష్ణ (డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్), జిల్లా విద్యాధికారి మరియు జిల్లాలోని ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img