- Advertisement -
ఉమాదేవి పంచాయతీ కార్యదర్శి
నవతెలంగాణ – కాటారం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ధన్వాడ పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి తెలిపారు. మంగళవారం కాటారం మండలం లోని ధన్వాడ గ్రామంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంటికొక మొక్కని నాటి,భవిష్యత్తు తరాలకి నీడనందిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని తెలిపారు. దీనిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్, ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -