Sunday, September 28, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ముధోల్ లో జఠాశంకర ఆలయంలో చోరీ ..

ముధోల్ లో జఠాశంకర ఆలయంలో చోరీ ..

- Advertisement -

మిట్ట మధ్యాహ్నం ఘటన..
నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో మిట్ట మధ్యాహ్నం జఠాశంకర ఆలయంలో గుర్తుతెలియని దొంగ హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పూర్తి విరాల్లోకెళ్తే…. ముధోల్ గ్రామ సమీపంలో గల జఠాశంకర ఆలయంలో మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని దొంగ ఆలయంలో ఉన్న హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లాడు. ఈ విషయాన్ని ఆలయానికి వచ్చిన భక్తులు గమనించి ఆలయకమిటీ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ తన సిబ్బందితో ఆలయానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.

ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ  ఫుటేజ్ ను పరిశీలించారు. ఈ ఫుటేజ్ లో దొంగ హుండీ తాళం పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లినట్లు కనిపిస్తుంది. ఆలయ పరిసరాల్లో మరో ఇద్దరు గుర్తుతెలియని వారు ఆ సీసీ ఫుటేజ్లో కనిపించారు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ఆలయానికి శని, సోమవారం, అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీంతో హుండీలో కూడా డబ్బుతో పాటు విలువైన కానుకలు సమర్పిస్తారు. ఓక్క ప్రక్క ముధోల్ లో పశువుల చోరీలతో రైతుల ఆందోళన చెందుతుంటే.. మరోపక్క మిట్ట మధ్యాహ్నం ఆలయంలో  గుర్తుతెలియని దొంగ చోరికి పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికి  ముధోల్ లో చోరీలు జరగటం గమనార్హం. ఈ ఘటనపై దొంగ ఆచూకీ కోసం గ్రామ ప్రధాన కూడళ్లలో ఉన్న సిసి పుటెజ్ ను పరీశీలిస్తున్నమని ఎస్ఐ బిట్ల పెర్సిస్ తెలిపారు. నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -