Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జీపీ కార్మికుల పేర్లు వెంటనే ఆన్లైన్లో పేరు నమోదు చేయాలి.. 

జీపీ కార్మికుల పేర్లు వెంటనే ఆన్లైన్లో పేరు నమోదు చేయాలి.. 

- Advertisement -

గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణపతి రెడ్డి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

గ్రామపంచాయతీ కార్మికుల ఆన్లైన్లో లేని వారి పేర్లను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని గ్రామపంచాయతీ అండ్ ఎంప్లాయ్ గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణపతి రెడ్డి అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఏళ్ల తరబడిగా గ్రామాలలో పంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్నారని, పేర్లు నమోదు చేసుకోకపోవడం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మల్టీ పర్పస్ విధానమనే పేరుతో ఆన్లైన్లో పేరు లేని వారికి వేతనాలు చెల్లించడం లేదని గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు అట్టడుగు వర్గాల సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వారిని పేర్లు లేవనే పేరుతో వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాల్లో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి సంవత్సరం గడుస్తున్నా.. పూర్తవుతున్న గ్రామపంచాయతీ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. సమస్యలు నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని ఆవేదన చెందారు. కనీసం ఆన్లైన్లో పేరు లేని వాళ్లకు కార్మికుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయడం కూడా జరుగడం లేదని అన్నారు. వెంటనే ఆన్లైన్లో పేరు లేని కార్మికుల పేర్లు నమోదు చేయాలని డింమాండ్ చేశారు. కనీస వేతనం చెల్లించాలని బకాయిగా ఉన్న వేతనాలు చెల్లించాలని పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచాలని అన్నారు.

ఇతరుల వేధింపులు ఆపాలని ప్రమోషన్లు కల్పించాలని ప్రమోషన్లు కల్పించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కార్మికులందరికీ కనీస కార్మిక చట్టాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ మహిళా రాష్ట్ర కన్వీనర్ పొట్ట యాదమ్మ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు కల్లూరు మల్లేశం గ్రామపంచాయతీ వర్కర్స్ అయిన ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వందల భిక్షం గడ్డం ఈశ్వర్, నాయకులు యాదగిరి, నరసింహ బాబు, బాల్రాజ్ రాము, వీరస్వామి, లక్ష్మీ, విజయ, బలే పెళ్లి సామి స్వామి, చంద్రకాంత్, లక్ష్మి నరస లక్ష్మి, జగతయ్య, రామలింగం లక్ష్మి లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad