నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని అమీర్ నగర్ గ్రామంలో గురువారం చౌట్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 11న గ్రామంలో ఒకరికి డెంగ్యూ నిర్ధారణ జరిగిన నేపథ్యంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వైద్యాధికారినీ డాక్టర్ స్పందన వైద్య సేవలు అందించారు. శిబిరానికి హాజరైన ప్రజలను పరీక్షించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. అనంతరం సీజనల్ వ్యాధులపై ఇంటింటికి అవగాహన కార్యక్రమం చేపట్టారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. దోమలు వృద్ధి చెందకుండా పాడైన పాత వస్తువుల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయాలని సూచించారు. జ్వరాలు వస్తే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విచ్చేసి రక్త పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి సత్యనారాయణ, ఆశ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరు పాల్గొన్నారు.
అమీర్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES