ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తాడిచర్ల సొసైటీ పాలకవర్గం
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గం గడువు టిసిఎస్ చట్టం1964 సెక్షన్ 32(7)(ఏ) ప్రకారం మరో ఆరు నెలలపాటుగా పొగిస్తున్నట్లుగా గురువారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 2019 ఎన్నికలు జరగగా వాస్తవానికి 6 నెలల క్రితమే గడువు ముగియగా మరో ఆరు నెలలు పొడగించిన విషయం తెలిసిందే. గురువారం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో మరో 6 నెలలు 2026 ఫిబ్రవరి 14 వరకు పొడగించారు.పాలకవర్గం పదవీకాలం పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబులకు తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య తోపాటు పాలకవర్గం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సహకార సంఘం పాలకవర్గాల గడువు పొడిగింపు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES