Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్ఏఐటీయూసీలో చేరిన 63 మంది సీఐటీయూసీ కార్మికులు

ఏఐటీయూసీలో చేరిన 63 మంది సీఐటీయూసీ కార్మికులు

- Advertisement -

నవతెలంగాణ – శంకరపట్నం
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో గురువారం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం, పాలేరు సంఘం జెండాలు ఆవిష్కరించబడ్డాయి. ఈ నేపధ్యంలో పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారంలో ఏఐటీయూసీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు. అనంతరం సీఐటీయూసీ సంఘం నుండి 63 మంది భవన నిర్మాణ పాలేరు కార్మికులు ఏఐటీయూసీలో భారీగా చేరారు.

ఈ సందర్భంగా పిట్టల సమ్మయ్య పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. పాలేరు కార్మికుల సమస్యల గురించి ప్రస్తావిస్తూ, వారికి ప్రభుత్వ బీమా పథకం వర్తింపజేయాలని, ఆసుపత్రులలో, లేబర్ ఆఫీసులలో పాలేరు సంఘానికి గుర్తింపు ఇవ్వాలని పిట్టల సమ్మయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాటం వెంకటరమణారెడ్డి, ఉపసర్పంచ్ ఆడితం కుమార్, మాజీ వైఎస్ ఎంపీపీ  మోత ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్  తాడికొండ సదానందం, నాయకులు, గ్రామస్థులు, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad