కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
నవతెలంగాణ – చారకొండ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెగిన కేఎల్ఐ కాల్వను వెంటనే మరమ్మత్తులు చేసి, అవసరమైన చోట కాలువ డైవర్షన్లు ఏర్పాటు చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం చారకొండ మండలం జూపల్లి గ్రామ శివారులో కెఎల్ఐ కాల్వకు ఏర్పడ్డ గండిని జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నియోజకవర్గ వ్యాప్తంగా కేఎల్ఐ కాల్వకు అక్కడక్కడ గండ్లు ఏర్పడ్డాయన్నారు. జూపల్లి శివారులో కాల్వకు అక్రమంగా గండి పెడితే నీరు వృధాగా పోతుందని తెలిపారు. ఈ క్రమంలో చెరువులకు నీళ్లు నింపే విధంగా కాల్వకు డైవర్షన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో తక్షణమే కాల్వకు మరమ్మతులు చేయించి, నీరు వృధాని అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పార్థసారథి, ఈఈ శ్రీకాంత్, డి ఈ లుసమ్మయ్య ,దేవన్న ,బుచ్చిబాబు, కాంగ్రెస్ డిసిసి వైస్ ప్రెసిడెంట్ నకినమోని వెంకటయ్య యాదవ్, పాలాది బాలరాజ్ , ఎస్ఐ శంషుద్దీన్, కాంగ్రెస్ నేతలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
కెఎల్ఐ కాల్వకు మరమ్మతులు చేయాలి
- Advertisement -
- Advertisement -