- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్స్ అంచనా వేశారు. రాష్ట్రంలోని ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రానున్న 2 గంటల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపారు. హైదరాబాద్ లో రానున్న 4 గంటలు పొడి వాతావరణం ఉంటుందని.. వాయువ్య హైదరాబాద్‌లో ఈ రాత్రి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
- Advertisement -