నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రానికి చెందిన మాజీ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుంకేట రాజారెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో సుంకేట రాజారెడ్డి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనారోగ్యానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.రాజారెడ్డి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్,, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొంటికంటి నరేందర్, మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, రైతు విభాగం మండల అధ్యక్షులు బద్దం రాజశేఖర్, సంత రాజేశ్వర్, నరేందర్, బిఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES