నవతెలంగాణ – జుక్కల్
శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ మండలానికి చెందిన పలు గ్రామాల నుండి సుమారు 200 లకు పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి జుక్కల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తోట లక్ష్మీ కాంతారావు ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుండి నియోజకవర్గ అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. జుక్కల్ నియోజకవర్గ రూపు రేఖలు మార్చి, నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపగలిగే సత్తా కలిగిన ఏకైక నాయకుడు అని నమ్మి వారి నాయకత్వాన్ని బలపర్చేందుకు పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చెప్పారు.
జుక్కల్ కాంగ్రెస్ లో భారీ చేరికలు ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES