Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యుదఘాదానికి గేదె మృత్యువాత

విద్యుదఘాదానికి గేదె మృత్యువాత

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఊదురు గాలులు, భారీ వర్షానికి కరెంటు వైర్లు తెగి నేలపై పడ్డాయి. నోరు లేని జీవమైన గేదే ప్రమాదవశాత్తూ ఆ వైర్లను తొక్కింది. దీంతో ఆ గేదె అక్కడికక్కడే మృత్యువాత పడింది. సమాచారం అందుకున్న గ్రామ కార్యదర్శి సంజయ్ ప్రమాద స్థలానికి వెళ్లి పరిశీలించారు. జరిగిన ఘటనపై పంచనామ చేసి కరెంట్ అధికారులకు నివేదికలు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఆ గేదె విలువ దాదాపుగా రూ.70,000/- ఉంటుందని గేదె యజమాని అమృత్వార్ రామబోయి తెలిపారు. అమృత్వార్ రామబోయి కుటుంబాన్ని గ్రామ మాజీ ఎంపీటీసీ కుటుంబ సభ్యులు దావూద్ పటేల్ తదితరులు పరిశీలించారు. అనంతరం ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఈ సందర్బంగా కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad