Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుభారీ వర్షానికి నీట మునిగిన పంటలు

భారీ వర్షానికి నీట మునిగిన పంటలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మద్నూర్ మండలంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంటలు నీట మునిగాయి. దన్నూరు గ్రామ శివారులో వరద నీటికి పంటలు భారీగా ముంపుకు గురి అయ్యాయి. ఈ శివారు ప్రాంతంలో సోయా చెరుకు పంట నీట మునిగినట్లు ఆ గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా మద్నూర్ జుక్కల్ మండలానికి ముఖ్యమైన రహదారి మద్నూర్ మండలంలోని అంతాపూర్ సోమూరు గ్రామాల మధ్య గల వాగు పొంగిపొరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వాగు పైన ఓవర్ బ్రిడ్జ్ నిర్మించకపోవడం వలన వర్షాకాలంలో వరదలు రాస్తే రాకపోకలు నిలిచిపోవడం సర్వసాధారణమే. ఈ బ్రిడ్డి నిర్మాంణం కోసం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే దాదాపుగా రూ.3 కోట్లమేర ఖర్చు చేశారు. కానీ అది పూర్తి కాకుండా అర్ధాంతరంగా నిలిచిపోయి, ఇప్పుడు శిలాఫలకం మాత్రమే దర్శనిమిస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad