Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి..

కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి..

- Advertisement -

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు వినతి
నవతెలంగాణ – జన్నారం

గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని గల్ఫ్ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో శనివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందని సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కల్ల్లెడ భూమన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఇటీవల అమలు చేసిన పలు కార్యక్రమాలు, అడ్వైజర్ కమిటీ వేసిన తెలంగాణ ప్రభుత్వం కు సీఎం  రేవంత్ రెడ్డికి తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

తొందరగా గల్ఫ్ బోర్డు ప్రకటించేలాగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కృషి చేయాలని వినతిపత్రం అందజేశమనీ అన్నారు. అందులో గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి కుటుంబాల ఆర్థిక భద్రతకు ప్రత్యేకంగా “గల్ఫ్ సంక్షేమ బోర్డు” ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు.  2024 ముందు గల్ఫ్‌లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు మృత ధన సహాయం అందేలాగా చూడాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉచిత వైద్యసేవలు అందించాలని అన్నారు. తిరిగి వచ్చిన కార్మికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీ షెషన్ లో కార్మికుల తరపున నా వాయిస్ వినిపిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శేపూరు గోపాలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరుగు మల్లికార్జున్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మహమ్మద్ హసన్, జిల్లా ఇంచార్జ్ పెట్టం రమేష్, జిల్లా అధ్యక్షులు ఎరుకల రమేష్ గౌడ్, మండల అధ్యక్షులు మగ్గిడి తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి దుమల్ల ఎల్లయ్య రెడ్డి, మండల నాయకులు వేముల నాగేష్, మెరుగు సత్తి గౌడ్ కొండూకూరి ప్రశాంత్, నగేష్, మురుగుట్ల శేఖర్, కుదురుపాక రాజన్న, సంపత్, మల్లేష్, గంగాధర్, సాట్ల సత్యం, మల్లేష్,  వివిధ గ్రామ నాయకులు, పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad