Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఎస్ఐ అనిల్ రెడ్డిని సన్మానించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్

ఎస్ఐ అనిల్ రెడ్డిని సన్మానించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డిని శనివారం  వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా ఉత్తమ సేవలందించినందుకు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎస్ఐ అనిల్ రెడ్డి ఉత్తమ సబ్ ఇన్స్పెక్టర్ గా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ నిరంజన్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చేతుల మీదుగా అవార్డు అందజేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అనిల్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు భీంగల్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో ఉత్తమ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా అవార్డు పొందినందుకు ఆయనను కలిసి శాలువాతో  ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సామ మహేందర్, చెంగల అశోక్, కొండ నరేష్, కరిపే శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad