స్నేహితుడి  కుటుంబానికి ఆర్ధిక సహాయం

నవతెలంగాణ- నూతనకల్
మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-1992 ఏడాది పదోతరగతి విద్యను అభ్యసించిన మండల పరిధిలోని ఎర్రపహాడు గ్రామానికి చెందిన శ్రీరామ ఉప్పలయ్య ఇటీవల అనారోగ్యతో మృతి చెందారు మంగళవారం పూర్వ విద్యార్థులు (1991-1992) మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి 13వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరుగు బుచిమల్లు , నెలుట్ల కృష్ణయ్య, కోడి రవి, దీకొండ వెంకటేశ్వర్లు, ఎనిగతల కృష్ణయ్య, మొగుళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love