నవతెలంగాణ -పెద్దవంగర
స్నేహితులు కేవలం సుఖాల్లోనే కాదు, కష్టాల్లోను తోడుంటామని నిరూపించారు. మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. మండలంలోని అవుతాపురం గ్రామానికి చెందిన గద్దల సంపత్ (32) ఇటీవల ఆకస్మికంగా మరణించారు. విషయం తెలుసుకున్న 2009-10 పదో తరగతి బ్యాచ్ చిన్ననాటి స్నేహితులు తలా కొంత మొత్తాన్ని జమచేసి రూ. 21 వేలు ఆయన భార్య ఎలేంద్రకు అందజేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సంపత్ తో ఉన్నటువంటి జ్ఞాపకాలను స్మరించుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. కాగా సంపత్ కు ముగ్గురు పిల్లలు సంతానం. ఆర్థిక సహాయం అందించిన వారిలో హరిశంకర్, అసలంత్ పాషా, శ్రీకాంత్, రాజు, నవీన్, అశోక్, కుమారస్వామి తదితరులు ఉన్నారు.
స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES