- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని చిన్నగుల్లా వంతెన వద్ద ఎగువ నుండి గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీటి ఉధృతి పెరిగింది. కల్వర్టుపై నుంచి నీరు ప్రవహిస్తోంది. గ్రామస్తులు జుక్కల్ ఎంపీడీఓకు సమాచారం అందించారు. వెంటనే ఆయన సిబ్బందితో కలిసి చిన్నగుల్లా గ్రామానికి చేరుకున్నారు. అనంతరం కల్వర్టును పరిశీలించి, గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. వర్షాలు భారీగా పడుతుండడంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకి రావద్దని తెలిపారు. కల్వర్టు పాక్షికంగా ధ్వంసమైందని, దాని దరిదాపుల్లోకి ప్రజలు రాకుండా జాగ్రత్త పడాలని తెలిపారు.
- Advertisement -