నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కౌలాస్ నానా ప్రాజెక్టు లోని వరద నీరును ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోమవారం తెల్లవారుజామున ఐదు గేట్లు ఎత్తివేశారు. ఈ క్రమంలో దిగువకు నీటిని విడుదల చేశామని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ..ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు ఉండగా.. ప్రస్తుతము 457. 80 మీటర్లు ఉందని తెలిపారు. కెపాసిటీ 1.237 క్యూసెక్కులు ఉండగా.. ప్రస్తుతము 1.188 క్యూసెక్కులు ఉందని వివరించారు. ఇన్ ఫ్లో 20 వేల 838 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని, అవుట్ ఫ్లో 20వేల 580 క్యూసెక్కుల నీటిని 5 గేట్ల ద్వారా దిగువకు వరద గేట్ల ద్వారా విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
కౌలాస్ నాలా ప్రాజెక్టు ఐదు గట్లు ఎత్తివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES