నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలో ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు భారీగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల మూలంగా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈరన్న మండల ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. నేను ఒక గ్రామానికి చిన్న నాయకునిగా.. మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. భారీ వర్షాలు పడుతున్న కారణంగా కరెంటు స్తంభాల దగ్గర ఉండకూడదని, వాగులు వంకల దగ్గరికి వెళ్ళకూడదని విజ్ఞప్తి చేశారు. పురాతనమైన ఇండ్లలో నివసించే వారు ఈ ముసురు వర్షానికి ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, చేను చెట్టుకు వెళ్లే వ్యవసాయదారులు వ్యవసాయ బోర్ల దగ్గర గాని, వరద నీటి వద్ద గాని అప్రమత్తంగా ఉండాలని ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విజ్ఞప్తి చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కాంగ్రెస్ గ్రామాధ్యక్షులు ఈరన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES