తడుగూర్ వాగు ఫుల్లు ఇరు మండలాలకు రాకపోకలు బంద్..
అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తహశీల్దార్, ఎంపీడీవో, ఎస్సైల విజ్ఞప్తి..
నవతెలంగాణ – మద్నూర్
ఆదివారం రాత్రి మద్నూర్ లో భారీగా వర్షం కురిసింది. భారీ వర్షానికి వాగులు వంకలు, పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుండి పారే లేండి వాగుకు వరద నీరు పోటెత్తింది. అదేవిధంగా పెద్ద తడగూర్ గ్రామ సమీపంలోని అలాగే అంతాపూర్ సోమూర్ గ్రామాల మధ్య వాగు నిండుగా పారుతుంది. ఇటు లేండి వాగు ఉధృతి మూలంగా మండలంలోని గోజేగావ్ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక మద్నూర్ జుక్కల్ మండలాలకు అతి ముఖ్యమైన రహదారి పెద్దత్తడుగూర్ రోడ్డు. ఈ రహదారి గుండా రెండు చోట్ల వాగులు పారుతాయి. వాటికి ఓవర్ బ్రిడ్జిలు లేక ఎప్పుడు వరదలొచ్చినా.. రాకపోకలు నిలిచి పోవాల్సిందే.
ఇలాంటి ఇబ్బందులు దూరం కావాలంటే వాగులపైన ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అత్యవసరం. ఇది ఇలా ఉండగా డోంగ్లి మండలంలోని లింబూరు గ్రామపంచాయతీ పరిధిలోని వాడి గ్రామానికి మళ్లీ రాకపోకలు నిలిచిపోయాయి. ఆ గ్రామానికి మధ్య వాగు పొంగిపొర్లుతోంది. ఈ గ్రామానికి కూడా వరద నీటితో రాకపోకలు నిలిచిపోయి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వర్షాకాలంలో నానా ఇబ్బందులు పడవలసిందే. భారీ వర్షానికి పంట చేనుల్లో నీరు నిలిచి, భారీగా పంట నష్టం వాటిల్లింది. మద్నూర్ మండలంలో అధికారులు అంచనాల ప్రకారం ఆదివారం రాత్రి కురిసిన వర్షపాతం 9.03 సెంటీమీటర్లుగా నమోదయింది.
అటు మంజీరా నది ఉధృతంగా పారుతుంది. ఇటు లేండి వాగు జోరుగా పారుతుంది. దీని మూలంగా భారీగా పంట నష్టం వాటిల్లే అవకాశాలు లేకపోలేదు. లేండి వాగు పరిహార ప్రాంతం అటు మంజీరా నది పరివాహక ప్రాంతం పంటలు నిట మునుగుతున్నాయి. ఈ పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మండల తహశీల్దార్ ఎండి ముజీబ్, పోలీస్ శాఖ ఎస్సై విజయ్ కొండ, మండల అభివృద్ధి అధికారి రాణి, ప్రజలకు తెలియజేశారు.
లేండి వాగుకు పోటెత్తిన వరద.. నిలిచిన రాకపోకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES