నవతెలంగాణ – చారకొండ
పీడిత బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని చరిత్ర లో కార్యాచరణ చారిత్రక యోధుడు, ఆదర్శ నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మండల గౌడ నాయకులు అన్నారు. సోమవారం మండల కేంద్రం లో పాపన్న గౌడ్ చౌరస్తా లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ, జయంతి మరియు విగ్రహ శంకుస్థాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. నిరంకుశ రాజరిక వ్యవస్థలో జమిందర్లు,జాగీర్దార్ల అరాచకాల సహించలేక సబ్బండ జాతులను కూడగట్టి గేరిల్లా సైన్యం తయారు చేసి పీడిత పాలకు చరమగీతం పాడిన సర్దార్ పాపన్న గౌడ్ నేటి యువత ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం లో భాగస్వాములు కావాలని వారు సూచించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు,ఇతర బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సర్దార్ పాపన్న బహుజన ఆదర్శ నాయకుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES