- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని లేండి వాగు వరద నీటితో సోనాల తడి ఇప్పర్గా గ్రామాల మధ్య రోడ్డుపైన భారీగా వరద నీరు రావడం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ రహదారి గుండా తడి ఇప్పర్గా లింబూర్ హసన్ టాక్లి పెద్ద టాక్లి సిర్పూర్ గ్రామాలకు మధ్య మధ్య గల వాగులు పొంగిపొరడంతో ఈ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన విషయాన్ని తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ సోనాల గ్రామాన్ని సందర్శించి, వరద నీటిని పరిశీలించారు. కొంతమంది వరద నీటితో వెళ్లలేక ఆగిపోయిన వారితో మాట్లాడుతూ.. వరద నీటి నుండి వెళ్లకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సబ్ కలెక్టర్ వెంట మండల తాసిల్దార్ ఎండి ముజీబ్, ఎంపీడీవో రాణి, గ్రామ కార్యదర్శి పంచాయతీ కార్మికులు ఉన్నారు.
- Advertisement -