Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీలకు ఫోటో క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలి: సీఐటీయూ

అంగన్వాడీలకు ఫోటో క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
అంగన్వాడీలకు ఫోటో క్యాప్చర్ విధానాన్ని రద్దుచేసి అధికారుల వేధింపులు ఆపాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి, మానవహారం చేశారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదు నెలల నుండి 4 సంవత్సరాల పిల్లలకు, గర్భిణీ, బాలింతలకు పౌష్టిక ఆహారం ఇచ్చే సందర్భంగా ఓషన్ ట్రాకర్ యాప్ లో ఫేస్ క్యాప్చర్ విధానాన్ని తీసుకురావడంతో. దీన్ని అమలు జరపటానికి అంగన్వాడీ టీచర్ల వద్ద ఉన్న పాత ఫోన్లు సరిగా పనిచేయక సిగ్నల్ రాక, ఆన్లైన్ సహకరించక, ఆధార్ కార్డులు పాతవి ఉండటంతో లబ్ధిదారు వద్ద గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని దీనివలన లబ్ధిదారులకు పౌష్టికాహారం లభించక ఇబ్బందులు పడతారని అంగన్వాడీ ఉద్యోగుల పైన గొడవలకు దిగుతున్నారని ఆమె అన్నారు.

ఇది పూర్తిగా ఆహార భద్రత చట్టాన్ని ఉల్లంఘించడమే తప్ప మరొకటి కాదని ఆమె విమర్శించారు దీంతో అంగన్వాడీ టీచర్లపై అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఎఫ్ ఆర్ ఎస్ విఫలమైతే ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడి ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించడానికి ఆన్లైన్ తెచ్చామని గతంలో ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పుడు ఈ విధానాల వల్ల అంగన్వాడీలకు ఒత్తిడి పెరిగిందని ఆమె అన్నారు. దీంతో తట్టుకోలేక చాలామంది అంగన్వాడీ ఉద్యోగులు ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రుల పాలవుతున్నారని అన్నారు. అదేవిధంగా ఫ్రీ ప్రైమరీ పేరుతో అంగన్వాడీ ఎత్తివేసే ఆలోచనను విరమించుకొని వాటిని అంగన్వాడీ టీచర్లతో నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ తగ్గించుకొని కార్పొరేట్ కంపెనీలకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి ఉద్యోగుల పైన పనిభారాన్ని మోపుతూ వాటి నుండి వారు దూరమయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారని ప్రతి సంవత్సరం కేటాయించే నిధులను తగ్గిస్తున్నారని వైఖరికి వ్యతిరేకంగా కార్మిక వర్గం సంఘటితంగా పోరాడినప్పుడే తమ హక్కులు కాపాడబడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, వికలాంగుల జాతీయ కుల వేదిక నాయకులు వేషాల గంగాధర్, అంగన్వాడి కార్యదర్శి పి స్వర్ణ, జిల్లా కోశాధికారి చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షులు మంగాదేవి మరియు ప్రమీల, గోదావరి, వాణి, ఎలిజిబెత్ రాణి, జరీనా, జగదాంబ, లక్ష్మి, హరిత తదితరులు పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చౌక్ లో నిరసన వెలుబుచ్చారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad