నవతెలంగాణ – మద్నూర్
భారీ వర్షాల మూలంగా జుక్కల్ నియోజకవర్గంలో నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్నాల ప్రాజెక్ట్ లు నిండుకుండల్లా నిండాయి. ఎగువ నుండి వరద నీరు ప్రాజెక్టులోకి భారీగా చేరాయి. అటు లేండి వాగు పొంగిపొర్లడం వీటితోపాటు, ప్రతి మండలంలో వాగులు వంకలు పొంగి అలుగులు పారుతున్నాయి. రహదారులు కూడా మూసుకుపోతున్నాయంటే వరద తాకిడి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో నియోజకవర్గంలో భారీగా పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నియోజక పరిధిలోని వాగులు, వంకలను ప్రాజెక్టులను రాత్రింబవళ్ళూ తేడా లేకుండా తిరిగి పరిశీలించారు. నీటి ఉధృతి ఎక్కువైనప్పుడు గేట్లు ఎత్తడం, నీటిని మంజీరాలోకి వదలడం, ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోవడం తన భాద్యతని, ఇది నా గొప్పతనం కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో మంగళవారం మద్నూర్, డోంగ్లి, మండలాల్లోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించారు. వరద ముంపునకు గురైన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలోని ఏ మండల పరిధిలోనైనా వరద నీటికి ముంపుకు గురై, పంట నష్టం జరిగిన వాటికి అధికారులతో క్షుణ్ణంగా పరిశీలింప చేస్తానని తెలిపారు. ప్రతి రైతుకు పంట నష్టపరిహారం అందించడమే నా బాధ్యత అని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకూడదని, నా బాధ్యతగా రాత్రింబవళ్లు కష్టపడతానని తెలిపారు. రాబోయే ఒకటి రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసిందని, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల కోసం అందుబాటులో ఉండి సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజల కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు.
బిచ్కుంద మండలం చెట్లూరు గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న గొర్రెలను, గొర్రెల కాపరులను కాపాడడం గొప్ప విజయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో బిచ్కుంద వ్యవసాయ శాఖ ఏడిఏ అభినబి, డోంగ్లి తాసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఆర్ ఐ సాయిబాబా, మండల వ్యవసాయ అధికారులు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, పోలీస్ శాఖ అధికారులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఆయా మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండడం నా భాద్యత: ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES