- Advertisement -
నిర్మాత, పంపిణీదారుడు, స్టూడియో అధినేత నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ (73) కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
నందమూరి తారకరామారావుకి పద్మజ పెద్దకోడలు. అలాగే దగ్గుబాటి వెంకటేశ్వర రావుకి సోదరి కూడా.
పద్మజ భౌతికకాయానికి బాలకృష్ణ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. పద్మజ మృతిపట్ల తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శులు టి.ప్రసన్నకుమార్, వై.వి.ఎస్.చౌదరి సంతాపం వ్యక్తం చేశారు.
- Advertisement -