నవతెలంగాణ -హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో) నూతన చైర్మెన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ శరత్ ఖైరతాబాద్‌లోని రెడ్కో ప్రధాన కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రెడ్కో వైస్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీ అనీల, జనరల్ మేనేజర్ జీఎస్వీ ప్రసాద్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) అనిల్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్) వెంకటరమణతో పాటు ప్రాజెక్ట్ డైరెక్టర్లు, మేనేజర్లు, సిబ్బంది నూతన చైర్మెన్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శరత్ మాట్లాడుతూ కొత్త సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన, సమర్థవంతమైన సేవల్ని అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంథనంపైనే ప్రభుత్వాలు ప్రధాన దృష్టి సారిస్తున్నాయనీ, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విధుల్ని నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
రెడ్కో నూతన చైర్మెన్ బాధ్యతల స్వీకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES