Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంగిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.700కోట్లతో ప్రతిపాదనలు

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.700కోట్లతో ప్రతిపాదనలు

- Advertisement -

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌళిక సదుపాయాల కోసం రూ.700 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేయండం జరిగిందని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన తండాలు, గూడాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. రాష్ట్రంలో గిరిజనాభివృద్థికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఇప్పటికే కేంద్ర గిరిజన శాఖ మంత్రిని పలుమార్లు కలసి నిధులను విడుదల చేయాలని కోరినట్టు తెలిపారు. గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన బోజనం అందంచేందుకు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. వసతి గృహాల్లో అల్యూమినియం వంట పాత్రలకు బదులుగా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పాత్రలు సరఫరా చేస్తున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి బోజన నాణ్యతపై ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నామని వివరించారు. కామన్‌ డైట్‌ అమలు చేసేందుకు అవసరమైన కూరగాయలు, గుడ్లు, చికెన్‌ ఇతర వస్తువులను జిల్లా స్థాయిలో టెండర్ల ద్వారా పారదర్శకంగా కోనుగోలు చేసెందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు అందేచేస్తున్న రూ.300 పించన్‌ను రూ.3,000లకు పెంచాలని ప్రతిపాదనలు పంపిచామని వివరించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి అలగు వర్షిని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad