Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్అర్హులము మేము మాకెందుకు ఇవ్వరు...

అర్హులము మేము మాకెందుకు ఇవ్వరు…

- Advertisement -

నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
మైనార్టీ సంక్షేమం ద్వారా అందించే కుట్టు మిషన్లను మాకెందుకు ఇవ్వరు మేము అర్హులం కాదా అని ముస్లిం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ సంక్షేమం ద్వారా అందించే కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈనెల పంద్రాగస్టు సందర్భంగా  కొంతమందికి మాత్రమే అందించగా మిగతా లబ్ధిదారులకు గురువారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మైనార్టీ స్కూల్ వద్ద మైనార్టీ శాఖ అధికారులు పంపిణీ చేపట్టారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మైనార్టీ మహిళలు అక్కడికి వచ్చి మాకెందుకు ఇవ్వరు మేము కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాం కదా అంటూ అధికారులను ప్రశ్నించారు. అర్హుల జాబితాలో మీ పేర్లు లేవని అర్హుల జాబితాలో ఉన్న వారికి మాత్రమే కుట్టు మిషన్లను పంపిణీ చేస్తామని జిల్లా మైనార్టీ శాఖ అధికారి భారతి తెలిపారు. దీంతో ముస్లిం మహిళలు మాక్కూడా కుట్టుమిషన్లను అందించాలని నిరసన వ్యక్తం చేశారు.

అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు కుట్టుమిషన్లను అందిస్తున్నారని, కుట్టుమిషన్లు పక్కదారి పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆరోపణ చేశారు. ఈ విషయంపై జిల్లా మైనార్టీ శాఖ అధికారి భారతిని వివరణ కోరగా ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో 2024 – 25 సంవత్సరానికి గాను ఆన్లైన్లో దరఖాస్తులు 2300 కు పైగా దరఖాస్తులు రాగా.. అర్హులైన వారిని జిల్లా కలెక్టర్ సమక్షంలో ఎంపిక చేశారని వారు తెలిపారు. ఆ ఎంపిక చేసిన జాబితా ప్రకారమే ఇప్పుడు వారికి పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ నిరసన చేపట్టిన వారిలో ఎండి హీనా, సలీమా, ఎండి రజియా, షేక్ రహేన, జరీనా, సిమ్రాన్, నస్రీన్, సైనాజ్ , షాహేదా,నేహ, నర్సీనా, నౌసిన, నూర్జహాన్ ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad