– గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని హస కొత్తూర్ గ్రామంలో గురువారం డెంగ్యూ కేసు నమోదైనట్లు ఎంపీడీవోచిందా రాజ శ్రీనివాస్ తెలిపారు. వెంటనే మండల పంచాయతీ అధికారి సదాశివ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో డెంగ్యూ కేసు నమోదైన ఇంటి పరిసరాలు, చుట్టు పరిసర ప్రాంతాలలో థెమిఫోస్ పిచికారి చేయించినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగిందన్నారు. చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గ్రామంలో ఇంటింటికి వెళ్లి సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి నవీన్ గౌడ్, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హాస కొత్తూర్ లో డెంగ్యూ కేసు నమోదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES