ఫలించిన చర్చలు..
సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్
జిల్లా వైద్యాధికారి సమక్షంలోగత వారం రోజులుగా నగరంలోని ఆశా వర్కర్లు అధికారుల వేధింపు వేధింపులకు నిరసనగా జరుపుతున్న పోరాటాన్ని స్పందించి అధికారులుచర్చలకు పిలవడం జరిగింది. ఈ చర్చల సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్ మరియు నూర్జహాన్ ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు శోభ, సి హెచ్ నర్సు బాయ్, సుకన్య తదితరులు పాల్గొనడం జరిగింది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అధికారులు ఆశాల పట్ల వ్యక్తిగత సమస్యలపై దూషించటం మరియు మహిళలని కూడా చూడకుండా మానసిక ఆవేదనకు గురి చేయటం జరుగుతుందని దానికి తోడు ఆశాలపై విపరీతమైన పనిభారాన్ని మోపుతున్నారని దీన్ని నిరసిస్తూ గత వారం రోజులుగా నగరంలోని చంద్రశేఖర్ కాలనీ అర్బన్ హెల్త సెంటర్ ఆశాలు ఆందోళనకు పూనుకోవటంతో వారికి మద్దతుగా జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఆశ వర్కర్లు సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఆందోళనలు నిర్వహించారు.
ఈ ఆందోళనలకు స్పందించిన జిల్లా వైద్యాధికారి ఈరోజు సిఐటియు నాయకులనుచర్చలకు పిలవడంతో ఆశాలు తమ సమస్యలను పరిష్కరించాలని వ్యక్తిగత దూషణలను మానుకోవాలని పని భారాన్ని తగ్గించాలని చర్చించటం జరిగింది. దానికి స్పందించిన జిల్లా వైద్యాధికారి ఇకపైన అధికారులు ఆశా వర్కర్లతో సఖ్యతగా మర్యాదగా ఉండేటట్లు చర్యలు తీసుకుంటామని భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూస్తానని హామీ ఇవ్వటంతో ఆశా వర్కర్లు అధికారుల హామీకి అంగీకరించి రేపటి నుంచి విధులు నిర్వహించటానికి ఒప్పుకోవటం జరిగింది .స్పందించిన అధికారులకు యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో సమస్యలను పరిష్కరించటానికి అధికారులు ముందుకు రావాలని కోరుతూ విధులకు హాజరు కావటానికి ఒప్పించటం జరిగింది. ఈ చర్చల్లో జిల్లా వైద్యాధికారిణితో పాటు అధికారులు వేణు ఆశ యూనియన్ నాయకులుస్వప్న కవిత పద్మ లలిత సుమలత హనీఫా లావణ్య సునీత తదితరులు పాల్గొన్నారు.
ఆశాల సమస్యలపై చర్చలు జరిపిన జిల్లా వైద్యాధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES