No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఆదిలాబాద్ఏసీబీకి చిక్కిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్

ఏసీబీకి చిక్కిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్

- Advertisement -

రూ. 5 వేల లంచంతో పట్టుకున్న ఏసీబీ
కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలింపు
అధికారి రెండవసారి జైలుకెళ్లడం
లంచం అడిగితే సమాచారం ఇవ్వండి
ఏసీబీ డీఎస్పీ మధు వెల్లడి
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్

ఇవాళ రేపు లంచం లేనిదే పని కాదు అన్నట్లుగా సమాజం మారుతోంది. లంచం లేనిదే ఏ పని చేయం అన్నట్లుగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఏసీబీకి చిక్కి జైలుకు వెళ్లొచ్చిన సరే కొందరి బుద్ధులు మాత్రం మారడంలేదు. అదే పనిగా లంచం తీసుకుంటూ పనులు చేస్తున్నారు. తాజాగా జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఓ సబ్ రిజిస్టర్ టూ అధికారి ఏసీబీకి చిక్కారు. రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబట్టారు. శుక్రవారం కార్యాలయంలో ఏం జరుగుతుందోనని కార్యాలయ సిబ్బంది కొంత మంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో అధికారులు లంచం తీసుకుంటుండగా జాయింట్ రిజిస్ట్రర్ టూ కే.శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సిలికన్ పరీక్ష నిర్వహించి పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. కాగా ఈయన ఇదివరకే నిజామాబాద్ లో పని చేసినప్పుడు రిజిస్ట్రేషన్ విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డాడు.

అప్పుడు జైలుకు వెళ్ళొచ్చాడు. తాజాగా మళ్ళీ అదేపనితనం చూపించి మళ్ళీ జైలుకెళ్తున్నాడు.ఏసీబీ డిఎస్పీ మధు తెలిపిన వివరాల మేరకు.. బేల మండలం సిర్సన్నకు చెందిన మన్సుర్ ఖాన్ పటాన్ తన భార్య గౌసియ బేగం పేరున ఉన్న ఇంటిని తనపై గిఫ్ట్ డిడ్ కోసం ఈనెల 19న ముదస్సిర్ షా అనే డాక్యూమెంట్ రైటర్ పత్రాలు తయారు చేశారు. 20న దాన్ని జాయింట్ రిజిస్ట్రారర్ వద్దకు రాగా దాన్ని పరిశీలించి 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బాధితుడు దానికి ఒప్పుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో 1.34 నిమిషాలకు గిఫ్ట్ డీడ్ అయిన తరువాత ఐదు వేలు ఇస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. కేసు విచారణ అనంతరం కే.శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరు పరుచడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తమ పని చేసేందుకు లంచం అడిగినట్లైతే వెంటనే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసులు లేదా ఏసీబీని సంప్రదించాలన్నారు. అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ సంబర్ 1064 కు ఫోన్ చేయాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad