No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeసినిమాయూత్‌ని మెస్మరైజ్‌ చేసే కథ

యూత్‌ని మెస్మరైజ్‌ చేసే కథ

- Advertisement -

శ్రీ లక్ష్మీ ఆర్ట్స్‌, మీడియా 9 క్రియేషన్స్‌ బ్యానర్‌ పై నేతి శ్యామ్‌ సుందర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ రోమియో’. ఏ రీల్‌ లైఫ్‌ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌.
మనోజ్‌ కుమార్‌ కటోకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గురుచరణ్‌ నేతి, జుహీ భట్‌, అమిషి రాఘవ్‌ హీరో, హీరోయిన్స్‌గా నటించారు. ఎస్‌ కే ఖాదర్‌, నవనీత్‌ బన్సాలీ, కుల్దీప్‌ రాజ్‌ పురోహిత్‌ ముఖ్య పాత్రలను పోషించారు. చైతన్య గరికిన స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందించారు. ప్రజ్వల్‌ క్రిష్‌ సంగీతం సమకూరుస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్‌ను హీరోయిన్‌ శ్రియా శరణ్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా హీరో గురు చరణ్‌ నేతి మాట్లాడుతూ,’ఇదొక క్యూట్‌ లవ్‌ స్టోరీ. మనోజ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందిస్తున్నారు. యువతను ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్‌ ఇందులో ఉంటాయి’ అని తెలిపారు.
‘ఇది చిన్న సినిమా అయినా విజువల్‌గా మాత్రం పెద్ద సినిమా చూసిన అనుభవం కలుగుతుంది. సినిమా మొత్తం దాదాపు పూర్తయి పోయింది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ వర్క్‌ జరుగుతోంది. గురుచరణ్‌ చాలా ఎనర్జిటిక్‌గా నటించాడు. తన పర్ఫార్మెన్స్‌ అందరూ మెచ్చేలా ఉంటుంది. విజువల్‌గా మేం ఊహించిన దానికంటే డబుల్‌ రిజల్ట్‌ను అందించాడు సినిమాటోగ్రాఫర్‌ చందు’ అని దర్శకుడు మనోజ్‌ కుమార్‌ అన్నారు.
శ్రియా శరణ్‌ మాట్లాడుతూ, ‘టీజర్‌ చాలా బాగుంది. మూవీ కూడా బ్యూటీఫుల్‌గా ఉంటుంది. ఈ కథ యూత్‌ని మెస్మరైజ్‌ చేసేలా ఉంటుంది. ఇందులో పార్ట్‌ అయిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం విజయం సాధించి, మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad