Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సీపీఎస్ విధానం రద్దు చేయాలని తహశీల్దార్ కు వినతి

సీపీఎస్ విధానం రద్దు చేయాలని తహశీల్దార్ కు వినతి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన కోరికలన్నీ నెరవేరుతాయని ఎన్నో కలలు గన్నామని టిపియూఎస్ మండల నాయకులు అన్నారు. కానీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజులకె ఉద్యోగ ఉపాధ్యాయుల ఆశలను అడియాశలు చేస్తూ ఆగస్టు 23, 2014 రోజున ఒక చీకటి జీవో నెంబర్ 28ను తీసుకొని రావడం, ఆ జీవో ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విధంగానే 1 9 – 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ సిపిఎస్ కొత్త పెన్షన్ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకోవడం అత్యంత దురదృష్టకరం అని టిపియూఎస్ మండల నాయకులు తెలిపారు.

2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపు సిపిఎస్ ను రద్దు చేస్తామని తెలియజేయడం జరిగింది. మేనిఫెస్టో హామీ ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన ఉన్న ప్రజా ప్రభుత్వం సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం ను పునరుద్ధరించాలని, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టిపియూఎస్ ప్రభుత్వాన్ని కోరుతూ శనివారం మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు .ఈ వినతి పత్రం కార్యక్రమంలో డిపి యూఎస్ మండల అధ్యక్షులు పండరినాథ్ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad