– ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్యయత్నం..
నవతెలంగాణ – బెజ్జంకి
వ్యవసాయ సాగుకు వినియోగించే రసాయనిక మందు తాగి..చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి యువకుడు మృతిచెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని గుగ్గీళ్ల గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం బాణాల రఘు(22)మెట్రిక్ పూర్తి చేసి ఐటీఐ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఉద్యోగం రావడంలేదనే మనస్తాపంతో తమ వ్యవసాయ సాగు వద్ద ఈ నెల 21న రసాయనిక మందు తాగి ఆత్మహత్యయత్శానికి పాల్పడ్డాడు. యువకుడి బంధువులు చికిత్స కోసం అంబులెన్స్ యందు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.మేరుగైన చికిత్స కోసం
ప్రభుత్వాస్పత్రి నుండి ఎల్లారెడ్డిపేటలోని ప్రయివేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించి చికిత్స చేయిస్తున్నారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి యువకుడు మృతి చెందాడు. మృతుని తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టినట్టు ఏఎస్ఐ శంకర్ రావు తెలిపారు.