నవతెలంగాణ – మద్నూర్
అన్న బహు సాటే ఒక మేధావి అని ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్దామని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణాతార అన్నారు. మద్నూర్ మండలంలోని తడి ఇప్పర్గా గ్రామంలో ఏర్పాటుచేసిన అన్న బహు సాటే విగ్రహాన్ని మంగళవారం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, డోంగ్లి సింగిల్ విండో చైర్మన్ లు కలిసి ఆవిష్కరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ రామ్ పటేల్ ,ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్ ప్రకాష్ గైక్వాడ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బన్సీ పటేల్, మహారాష్ట్ర నాందేడ్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుని కుటుంబ సభ్యులు, దశరథ్, దత్తు, దళిత నాయకులు తుకారాం ,భుజంగ, విజయ్, వెంకట్ కాలే, గ్రామస్తులు ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ చేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రామస్తులంతా పాల్గొన్నారు.
ఇప్పర్గా గ్రామంలో అన్న బహుసాటే విగ్రహావిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES