రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చింతరాజు
నవతెలంగాణ – దుబ్బాక
విషపూరితమైన రంగులు అద్దిన వినాయకుల ( ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసిన )ను చెరువుల్లో నిమజ్జనం చేయడం ద్వారా నీటి కాలుష్యంతో పాటు గాలి, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చింతరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు.
బుధవారం దుబ్బాక మున్సిపల్ కేంద్రంలో మణికంఠ ఏజెన్సీ (హెచ్.పీ గ్యాస్) ఆధ్వర్యంలో సుమారు 1000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం గత 15 ఏళ్లుగా మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. రోజు రోజుకూ పర్యావరణం కలుషితం అవుతోందని, దీన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి ముందు తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చింత మణికంఠ పలువురు ఉన్నారు.