Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్కడెం కెనాల్ లో పడి వ్యక్తి మృతి...

కడెం కెనాల్ లో పడి వ్యక్తి మృతి…

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
ప్రమాదవశాత్తు కడెం కెనాల్ డిస్ట్రిబ్యూటరీ 12 లో పడి  వ్యక్తి మృతి చెందిన సంఘటన జన్నారం మండలంలోని మర్రిగూడ గ్రామంలో చోటుచేసుకుంది.  ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపిన వివరాల ప్రకారం, మర్రిగూడ గ్రామానికి చెందిన బాదావత్ గంగాధర్ ( 25) వ్యక్తి పనుల నిమిత్తం  బయటకు వెళ్లి తిరిగి రాకపోగా  గురువారం ఉదయం 8 గంటల సమయంలో  కడెం కాల్వ 12వ డిస్ట్రిబ్యూటర్ పిల్ల కాలువలో మృతి చెంది ఉండాడని తెలిపారు. మృతుడు ఈనెల 27న పని నుంచి ఇంటికి వచ్చే సమయంలో  కురుస్తున్న అధిక వర్షాలకు కాలుజారి  కాలువలో పడడంతో మృతి చెందినట్లు గుర్తించడం జరిగిందన్నారు. మృతునికి భార్య మంజుల ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య మంజుల  ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad