Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్అశ్రయఆకృతి – ఆప్టమ్ఇండియా ‘మొబైల్హియరింగ్క్లినిక్’ ఆవిష్కరణ

అశ్రయఆకృతి – ఆప్టమ్ఇండియా ‘మొబైల్హియరింగ్క్లినిక్’ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సమగ్ర ఆరోగ్య సంరక్షణ దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా, వికలాంగులను సాధికారత చేయడంలో కృషి చేస్తున్న అశ్రయ ఆకృతి అనే స్వచ్ఛంద సంస్థ, ఆప్టమ్ ఇండియాతో భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తూ అశ్రయ ఆకృతి మొబైల్ హియరింగ్ క్లినిక్‌ను ఆవిష్కరించింది. పూర్తిగా సకల సదుపాయాలతో సిద్ధమైన ఈ మొబైల్ యూనిట్, హైదరాబాద్‌లోని వెనుకబడిన వర్గాలకు నేరుగా చేరుకొని సమగ్ర చెవి–ముక్కు–గొంతు (ENT) ఆరోగ్య సేవలనుu అందించనుంది.

ఈ కార్యక్రమం ద్వారా ఆధునిక వైద్య పరికరాలు, శ్రవణ పరీక్షలు, తొందరగా గుర్తింపు, సకాలంలో చికిత్సలు లాంటి కీలక సేవలు అందుబాటులోకి వస్తాయి. వెనుకబడిన సమాజాల గడప వద్దకే ఆరోగ్య సేవలను తీసుకెళ్లడం ద్వారా, ఈ మొబైల్ క్లినిక్ ఆరోగ్య లోటుపాట్లను పూడ్చి వినికిడి సమస్యలతో బాధపడుతున్న వారి జీవిత నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.

మొబైల్ హియరింగ్ క్లినిక్ను అశ్రయ ఆకృతి వ్యవస్థాపకుడు శ్రీ డి.పి.కే. బాబు గారు, ఆప్టమ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఉమా రత్నం కృష్ణన్ గారితో కలిసి ఆప్టమ్ హైదరాబాద్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రారంభోత్సవంతోపాటు పలు కమ్యూనిటీ స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించబడతాయి. వీటిలో లబ్ధిదారులు ఉచిత పరీక్షలు, నిపుణులైన ENT వైద్యుల సలహాలు పొందవచ్చు.

ఈ సందర్భంగా అశ్రయ ఆకృతి వ్యవస్థాపకుడు శ్రీ డి.పి.కే. బాబు గారు మాట్లాడుతూ –
అశ్రయ ఆకృతిలో, ఒక చిన్నారి వినికిడి పొందినప్పుడు వారి లోకమే ఎలా మారిపోతుందో మేము చూశాం. విద్య, స్నేహాలు, భవిష్యత్తు అవకాశాలకై కొత్త తలుపులు తెరుచుకుంటాయి. ఆప్టమ్ ఇండియాతో భాగస్వామ్యంలో ప్రారంభిస్తున్న మొబైల్ హియరింగ్ క్లినిక్ వాస్తవాన్ని మార్చడానికి హృదయపూర్వకమైన అడుగు. వెనుకబడిన వర్గాలకు నేరుగా చేరుకొని, వినికిడి సమస్యలను తొందరగా గుర్తించి చికిత్స చేయడం మాత్రమే కాదు, ఆశ, గౌరవం, ఆత్మవిశ్వాసం పునరుద్ధరించడం కూడా మా లక్ష్యం” అని అన్నారు.

ఈ భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి వినడానికి, నేర్చుకోవడానికి, ఎదగడానికి సమాన అవకాశం కలిగిన సమాజాన్ని నిర్మించాలనే నిబద్ధతను ప్రతిబింబిస్తోంది.

ఆప్టమ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఉమా రత్నం కృష్ణన్ గారు మాట్లాడుతూ –
ఆప్టమ్ ఇండియాలో, అర్థవంతమైన మార్పు తీసుకురావడంలో భాగస్వామ్య శక్తిపై మాకు నమ్మకం ఉంది. ‘ఇన్ ఇండియా, ఫర్ ఇండియా’ అనే మా ధ్యేయంతో, మా CSR కార్యక్రమాల ద్వారా 4 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా, దాదాపు 10 లక్షల మందికి పరోక్షంగా మేము ప్రభావం చూపగలిగాము. అశ్రయ ఆకృతితో మా భాగస్వామ్యం లక్ష్యానికి నిదర్శనం. వారి హియరింగ్ క్లినిక్‌లకు మేము అందిస్తున్న మద్దతు వల్ల హైదరాబాద్‌లో మరింత మందికి వినికిడి సేవలు చేరువ అవుతున్నాయి. ఇప్పుడు మొబైల్ హియరింగ్ క్లినిక్ ప్రారంభం కావడం ద్వారా సమీప జిల్లాలకు కూడా సేవలు విస్తరించబోతున్నాయి. ఇది మా సమిష్టి ప్రభావాన్ని మరింత పెంచే ఒక కీలక మైలురాయి” అని పేర్కొన్నారు.

అశ్రయ ఆకృతి గురించి
1996లో స్థాపించబడిన అశ్రయ ఆకృతి వికలాంగులకు మద్దతు అందించి, వారి ఎదుగుదలకు అనుకూల వాతావరణాన్ని కల్పించే స్వచ్ఛంద సంస్థ. విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఉచిత సేవలు అందించి వెనుకబడిన వర్గాల జీవితాలను మారుస్తూ వస్తోంది. WHO వరల్డ్ హియరింగ్ ఫోరం గుర్తింపు, CAF India సర్టిఫికేషన్, భారత ప్రభుత్వ CSR1 రిజిస్ట్రేషన్తోపాటు పలు పురస్కారాలు అందుకుంది – 2016లో హైదరాబాద్‌లో బెస్ట్ NGO, తెలంగాణ ప్రభుత్వంచే 2016–17లో బెస్ట్ NGO అవార్డు, 2024లో వికలాంగుల సాధికారతకు స్టేట్ అవార్డు.
ఆప్టమ్ ఇండియా గురించి
ఆప్టమ్ ఇండియా, ప్రపంచంలోని ఫార్చ్యూన్ 3 కంపెనీ యునైటెడ్ హెల్త్ గ్రూప్ (UHG)‌కు చెందిన గ్లోబల్ కెపబిలిటీ సెంటర్. 20 ఏళ్లకు పైగా భారతదేశంలో తమ సేవలతో, ఆరోగ్యరంగంలో డేటా అనలిటిక్స్, టెక్నాలజీ పరిష్కారాలు, ఇన్నోవేషన్‌ ద్వారా నాణ్యమైన ఆరోగ్య ఫలితాలను అందిస్తోంది. ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు, ఆరోగ్య వ్యవస్థ మరింత సులభం, చేరువ, అందుబాటులో ఉండేలా చేయడమే ఆప్టమ్ లక్ష్యం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad