– ఊరూరా వెలసిన గణేష్ లు
– పోటాపోటీగా విగ్రహాలు ఏర్పాటు
– మండల వ్యాప్తంగా 86 వినాయక మండలాలు
– ఎస్ఐ యయాతి రాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.ఒకే గ్రామంలో పలు వీధుల్లో ఉత్సవం విగ్రహాలు ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతి గ్రామంలోని వాడవాడలో సిద్ది వినాయకుడు కొలువుదీరాడు. మండల వ్యాప్తంగా గురువారం రెండోవ రోజు నాటికి 86 వినాయక మండపాలు వెలసినట్లు ఎస్ హెచ్ ఓ ఎస్ఐ యయాతి రాజు తెలిపారు. పట్టణంలోని పలు వాడలో ఏర్పాటు చేసిన ఉత్సవ మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఉత్సవ మండపాలను ఉత్సవ కమిటీల శ్రీ ఆద్వర్యంలో రంగు రంగుల విద్యుత్ కాంతులతో అలంకరించారు.బస్టాండ్ వద్ద గణేష్ ఆలయ సమీపంలో,పాత ఆంద్రా బ్యాంక్ రోడ్డులో కొలువుదీరిన 14 అడుగుల బారీ విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.మొదటి రోజు ఇంటి వద్ద నిర్వహించుకున్న పూజా విగ్రహాలను వెంకమ్మ చెరువులో భక్తులు కుటుంబ సభ్యులతో కలసి నిమజ్జనం చేశారు.
వినాయకుని దర్శించుకున్న ఎస్ఐ యాతిరాజు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES