- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నగరంలోని కోట గల్లీలో నివాసం ఉంటున్న లక్కుంట్ల రాజేశ్వర్ శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో తన ఇంటి నుండి తాను పనిచేస్తున్న ఇన్ఫినిట్ ఫైనాన్స్ ఆఫీస్ కి బైక్ పైన వెళుచుండగా మార్గమధ్యలో ఖలీల్ వాడీలో తన జేబులో నుంచి సెల్ ఫోను పడిపోయింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు గంగమోహన్ సెల్ ఫోన్ ను గుర్తించి, సెల్ ఫోన్ యజమాని అయినటువంటి రాజేశ్వర్ ని పిలిపించి అతనికి సెల్ ఫోన్ అందజేశారు. ఈ పోగొట్టుకున్న సెల్ఫోన్ విలువ 18, 000/- రూపాయల వరకు ఉంటుంది. నిజాయితీ చాటుకున్నటువంటి హోంగార్డ్ గంగ మోహన్ ని ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ అభినందించారు.
- Advertisement -