Tuesday, November 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంయూరియా దొరకడం లేదని పత్తి చేను పీకేసిన రైతు

యూరియా దొరకడం లేదని పత్తి చేను పీకేసిన రైతు

- Advertisement -

నవతెలంగాణ-పర్వతగిరి
అదును దాటుతున్నా యూరియా దొరకడం లేదని రైతు తన పత్తి చేనును పీకేశాడు. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం ఏబీ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఉట్టి తండాకు చెందిన భూక్య బాలు శుక్రవారం తన ఎకరం 20గుంటల పత్తి చేనును కుటుంబ సభ్యులతో కలిసి పీకేశాడు. వారం రోజుల నుంచి యూరియా బస్తాల కోసం తిరిగి విసుగు చెందానన్నాడు. అదును దాటిపోతున్నందున పత్తి చేనును పీకేసినట్టు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -