- Advertisement -
- – మాజీ జడ్పీటీసీ లక్ష్మీ నర్సాగౌడ్
నవతెలంగాణ -ముధోల్
ఉమ్మడి ముధోల్ మండలం లో చాలా గ్రామాల్లో గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా చేతికొచ్చినసొయా తో పాటు పత్తి,మొక్కజొన్న పంటలు పూర్తిగా నీట మునగడం తో రైతులు పూర్తిగా నష్టపోయారని మాజీ జడ్పీటిసి బొల్గం లక్ష్మి నర్సగౌడ్ శనివారం ఒక్క ప్రకటనలో తెలిపారు. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే సర్వే చేయించి, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .వర్షంతో పలు గ్రామాలకు రహదారులు ధ్వంసం కావడం తో రాకపోకలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు .రోడ్లు మరమ్మత్తులు చేయాలని కోరారు.కొన్ని గ్రామాల్లో ఇండ్లు కూలిపోయాయని అన్నారు. వెంటనే ప్రభుత్వం అన్ని రకాల సర్వే చేయించి వర్షాలకు నష్టపోయిన వారిని ఆదుకోవాలని కోరారు.
- Advertisement -