నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు స్టూడెంట్ లేడ్ మూమెంట్ అనే అంశంపై ముఖ్యంగా ప్లాస్టిక్ నివారణ కల్తీ నూనెను వడకం వల్ల ఎలాంటి అనర్ధాలు వస్తాయి. చెట్ల పెంపకం పెంచాలి అనే విషయాలపై విద్యార్థులందరూ స్టూడెంట్ లేడ్ మూమెంట్ అనే ఒక మెగా ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ నూనె కల్తీ నూనె వాడకూడదని కల్తీ నూనె వలన ఆరోగ్యానికి అనేక రకాల వ్యాధులు వస్తాయని, ప్లాస్టిక్ వాడడం వల్ల ఎన్నో అనర్ధాలు ఉన్నాయని, పర్యావరణాన్ని నాశనం చేస్తుందని తెలిపారు. ప్లాస్టిక్ బదులుగా జ్యూట్ బాక్స్ బట్టవంటి బ్యాగులు వాడాలని సూచించారు. చిన్నారులందరు సేవ్ ట్రీస్ అంటూ నినాదాలతో ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులందరూ చాలామందికి చెట్లను ఇచ్చి వాటిని పెంచాలని సూచించారు.
అంతేకాకుండా జంక్ ఫుడ్ తినకూడదని ఇంట్లో చేసిన వస్తువులను మాత్రమే తినాలని, జంక్ ఫుడ్ వలన ఎన్నో అనర్ధాలు చాలామంది చిన్నారులు వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. అందుకే పండ్లు కూరగాయలు తినాలని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ నినాదాలతో మారు మ్రోగించారు. అంతేకాకుండా ఐదవ తరగతి విద్యార్థులు ప్లాస్టిక్ వాడకూడదని దాని ద్వారా వచ్చే అనర్ధాలు ఒక మంచి నాటిక ప్రదర్శన ద్వారా తెలిపారు. చాలామంది ప్రజలు పాల్గొని విద్యార్థులందరూ చక్కగా వివరించారని ఇలాంటి సందేశాలను ఇప్పించినందుకు పాఠశాల యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ.. స్టూడెంట్ లెడ్ మూమెంట్ ద్వారా ఈ ముఖ్యమైన అంశాలను అనగా కల్తీ నూనె వాడకం జంక్ ఫుడ్ ప్లాస్టిక్ వాడకం చెట్లను పెంచడం అంటే అంశాలను విద్యార్థులు చక్కగా వివరించాలని, ప్రతి ఒక్కరూ ఈ అంశాలను గ్రహించి రాబోయే తరానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే మనం పర్యావరణాన్ని పరీరక్షించుకోవాలని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ దాస్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్, కల్తీ నూనె, చెట్ల పెంపకం గురించి లిల్లీపుట్ విద్యార్థుల అవగాహన ర్యాలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES