నవతెలంగాణ – మణుగూరు
మణుగూరు సింగరేణి ఏరియా హాస్పిటల్ లో జనరల్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న ఎం జ్యోతిర్మాయ్ కి డి వై సి ఎం ఓ పదోన్నతి పొందిన సందర్భంగా ఏఐటీయూసీ మణుగూరు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రటరీ వై రాంగోపాల్ మాట్లాడుతూ .. సేవా, అంకిత భావం, నైపుణ్యంగల వైద్య నిపుణులు గా మణుగూరు ఏరియా కార్మికుల హృదయంలో స్థానాన్ని డాక్టర్ జ్యోతిర్మాయి సంపాదించుకున్నారని డివై సిఎంఓ గా కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసీ మున్ముందు ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎం.రాంనర్సయ్య, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మేకల ఈశ్వరరావు, జాయింట్ సెక్రటరీ జి పుల్లారావు, ఆఫీస్ బేరర్స్ గోలీ గంగాధర్ రావు, ఆవుల నాగరాజు, ఆదర్ల సురేందర్, సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ దాట్ల సందీప్, పిట్ సెక్రటరీలు కే పద్మావతి ఎస్ కుమారస్వామి, ఈసo శ్రీనివాస్ ఆంథోని, రవికుమార్ ,ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ జానకి ప్రసాద్, రామారావు, సుదీప్ గడ్డం, రవి, జి రాజేందర్, దరిపల్లి వెంకటేశ్వర్లు, ఎన్ రాజేందర్, కడలి నాగేంద్రబాబు, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.