-ఎంపీడీవోగా బాలయ్య సేవలు అభినందనీయం..
– జిల్లా పరిషత్ సీఈఓ సి.రమేష్..
– ఉద్యోగానికి విరమణ కానీ ప్రజాసేవకు కాదు..
– జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి..
నవతెలంగాణ – రాయపోల్
ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సర్వ సాధారణమైనని ఉద్యోగ బాధ్యతలకు మాత్రమే విరమణ తప్ప ప్రజాసేవకు కాదని రాయపోల్ ఎంపీడీవోగా బాలయ్య సేవలు అభినందనీయమని సిద్దిపేట జిల్లా ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి. రమేష్, జిల్లా పంచాయతీ అధికారి బి. దేవకీ దేవి లు అన్నారు. శనివారం రాయపోల్ మండల ఎంపీడీవోగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన బాలయ్య కు ఆత్మీయ అభినందన వీడ్కోలు సభ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు పనిచేస్తున్నప్పుడు చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగం చేయడం సవాల్ తో కూడుకున్నదన్నారు. ఎంపీడీవో వృత్తి అనేది ఎంతో గొప్పనైనదన్నారు.ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొని పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులున్నా వాటిని అన్నింటిని ఎదుర్కొని గ్రామాల అభివృద్ధిలో తనవంతు పాత్ర పోసిస్తూ,ప్రభుత్వం అమలు చేసే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు అందజేస్తూ ప్రజల మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి బాలయ్య అన్నారు.
ఎంపీడీవో బాలయ్య కేవలం 18 నెలల కాలంలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు అందరితో కలిసిమెలిసి పని చేస్తూ ఎంతో మంది ఆప్యాయతలను సంపాదించుకోవడం గొప్ప విషయమన్నారు. రాయపోల్ మండల ఎంపీడీవో కార్యాలయంలో పూర్తిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది లేకపోయినప్పటికి బాధ్యతతో పనిచేసిన వ్యక్తి బాలయ్య అన్నారు. బాలయ్య జీవితంలో టైపిస్టు ఉద్యోగం నుంచి అంచలంచలుగా ఎంపీడీవోగా ఎదిగి రాయపోల్ మండలంలో పదవి విరమణ పొందడం హర్షించదగ్గ విషయమన్నారు.అందరితో మర్యాదగా గౌరవంగా నడుచుకుంటూ సౌమ్యుడుగా పేరుపొందిన బాలయ్య శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో గడపాలని కోరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఏడిఏ బాబు నాయక్, ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి, ఏవో నరేష్,వైద్యాధికారి మహారాజ్,ఎంపీడీవోలు మేరీ స్వర్ణకుమారి ,మచ్చెందర్,శ్రీనివాస్,మురళీధర్ శర్మ, ఎంపీఓ పరమేశ్వర్, దిశా కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి,మాజీ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి, మాజీ కో ఆప్షన్ సభ్యులు పర్వేజ్, సీనియర్ అసిస్టెంట్ ముత్తాలీఫ్, రాయపోల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు నాగరాజు, హరీష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తప్పటి సుధాకర్, బీజేపీ మండల అధ్యక్షులు మంకిడి స్వామి, పంచాయితీ కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సాధారణమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES