రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం..
సిపిఐ ఎంఎల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్..
యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్..
నవతెలంగాణ – కాటారం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వర్షాకాల సీజన్లో యూరియా అందించడంలో విఫలమైందని సిపిఐ ఎంఎల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్, యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్ లు అన్నారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. రైతులు చెళ్లలో పని విడిచిపెట్టుకొని ఒక రోజంతా క్యూలో నిలబడ్డ ఒక బస్తా దొరికిన దాఖలు కానరావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు సకాలంలో యూరియా అందిస్తున్నామని చెప్తున్నారు తప్ప.. ఆచరణలో కొనసాగడం లేదని అన్నారు. తక్షణమే యూరియా కష్టాల నుంచి రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
కాటారం సబ్ డివిజన్ పరిధిలో యూరియా డీలర్స్ యూరియాను నిల్వ ఉంచుకొని ఒక డిఎపి బస్తా కొంటేనే ఒక బస్తా యూరియా ఇస్తున్నారు. అది రైతులు షాపుల చుట్టూ ఒకటికి పది సార్లు తిరిగితే తప్ప ఇవ్వడం లేదన్నారు. తక్షణమే కలెక్టర్ స్పందించి, సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల వ్యవసాయ అధికారులతో మాట్లాడాలని అన్నారు. పూర్తిస్థాయిలో డీలర్ షాపులపై తనిఖీలు నిర్వహించి, నిర్లక్ష్యం చేస్తున్న డీలర్ షాపులో లైసెన్స్ రద్దు చేయాలని తెలిపారు. సకాలంలో రైతులకు యూరియా అందించాలని, లేకపోతే ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోటపల్లి బాబు రెడ్డి,బుర్రి కుమార్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.
రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES