నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
డా.బీఆర్ అంబెడ్కర్ యూనివర్సిటీలో సమత సపోర్ట్ స్కీం కింద గిరిజనులకు, దివ్యాంగులకు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత విద్యను అందించనున్నట్టు అంబేద్కర్ యూనివర్సిటీ స్టూడెంట్ సర్వీస్ డైరెక్టర్ వై.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఆయన డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని సందర్శించారు. అడ్మిషన్ల పెంపుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడి సిబ్బందికి సూచించారు. అనంతరం డిగ్రీ కళాశాల సైన్సెస్ ప్రిన్సిపల్ సంగీతతో కలిసి పలు విషయాలను చర్చించి నూతన కోర్సుల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రాష్ట్ర స్టూడెంట్ సర్వీస్ డైరెక్టర్ వై.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ రెగ్యులర్ గా చదవలేని విద్యార్థులకు విద్యను అందిస్తుందని అన్నారు.
ఉచిత విద్య గోండ్, కోయ, చెంచు ఇతర గిరిజన వర్గాల విద్యార్థులకు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఎడ్యూకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ద్వారా నాణ్యమైన సేవలను అందించేల వసతుల కల్పనకు కృషి కోసం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీ ద్వారా అందించే పుస్తకాలు పోటీపరీక్షలకు సైతం సన్నద్దమయ్యేలా ఉపయోగపడుతాయన్నారు. రెగ్యులర్ వారితో పోటీ పడేల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు రాణిస్తున్నారన్నారు. అడ్మిషన్లు పెంచేందుకు గాను రీజనల్ సెంటర్లను సందర్శించి ఇక్కడి వసతులు, ఇతర సౌకర్యాల గురించి తెలుసుకుంటున్నామన్నారు.
అదే సందర్భంలో నూతన పథకాల గురించి కూడా విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్ లో కొన్ని సమస్యలను గుర్తించడం జరిగిందని వాటిని కూడా అధిగమిస్తామని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు కొన్ని కోర్సులు ప్రవేశపెట్టాలని కోరగా ఆ దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ సీఎస్.టీడీ వెంకటరమణ, ప్రొఫెసర్ రవీందర్, వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్, వర్సిటీ సిబ్బంది అనిల్, హరిదాస్, సయ్యద్ శంషీర్ అలీ, తబ్రేజ్, రాంలకన్, అజీజా పాల్గొన్నారు.
ఆదిలాబాద్ లో పర్యటించిన అంబెడ్కర్ వర్సిటీ డైరెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES