- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
కామారెడ్డి జిల్లాలోని బీడీ కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి బీడీ కార్మికుల పిఎఫ్ ఉన్నవారందరికీ మంజూరు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు సురేష్ గొండ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు కామారెడ్డి ఎన్నికల డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్కరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, జీవన భృతి, ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని అన్నారు. బీడీ కార్మికులందరికీ 22 రోజులు పని కల్పించే విధంగా కార్ఖానా యజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. ఇచ్చిన హామీని అమలు చేయకుంటే కార్మికులతో కలిసి దశల వారి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
- Advertisement -